ఇల్లెందులో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం,జూలై9(జనంసాక్షి ): ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 40 వేల క్యూబిక్ విూటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడిరది. గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాలు, ఉపరితల అవర్తన ద్రోణి ప్రభావం వల్లఅశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో చెరువులు, వాగులు, వంకలు అలుగు పోశాయి. అశ్వారావుపేట మండలవ్యాప్తంగా 26 మిల్లీ విూటర్ల వర్షపాతం నమోదు అయింది. మండలంలోని అనంతారం, నారాయణపురం, కన్నాయిగూడెం ప్రాంతాల్లోని వాగుల్లో నీరు భారీగానే ప్రవహించింది. అనంతారంతో పాటు పలు గ్రామాల్లో గల చెరువుల్లో అలుగులు పారాయి. నారాయణపురం, వినాయకపురంతో పాటు పలు గ్రామాల్లో గల లోతట్టు ప్రాంతాల్లో నీరు భారీగా చేరింది.