ఇళ్ల నిర్మాణాలకు కళా శంకుస్థాపన

విజయనగరం,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరంలో విద్యుత్‌ శాఖా మంత్రి కె.కళా వెంకటరావు అధికారులతో కలిసి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా హుదూద్‌ తుఫాను బాధితులకు ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంచినీటి పథకం ద్వారా కుళాయిని ఏర్పాటు చేసి, ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖా మంత్రి కె.కళా వెంకటరావుతో పాటు మాజీ కేంద్ర మంత్రి విజయనగరం ఎంపిపి అశోక్‌ గజపతిరాజు, నెల్లిమర్ల ఎంఎల్‌ఎ పత్తివాడ నారాయణ స్వామినాయుడు, ఎంపిలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు