ఇవాళ పుల్వామా దాడికి మూడేళ్లు నిండాయి
గౌహతి: . ఆ ఘోర ఉగ్ర దాడిలో 40 మంది భారతీయ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ అమరవీరులకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు. సర్జికల్ స్ట్రయిక్స్‌ను ప్రశ్నిస్తూ విపక్షాలు అమరులను అవమానిస్తున్నాయని సీఎం అన్నారు. గాంధీ కుటుంబానికి విధేయులమని వాళ్లు చాటుకుంటున్నారని ఆరోపించారు. ఆర్మీని గాంధీ కుటుంబం మోసం చేసిందన్నారు. సైన్యం పట్ల తనకు విశ్వసనీయత ఉందని, జీవితమంతా తనను నిందించినా.. ఎవరినీ పట్టించుకోనని సీఎం బిశ్వ శర్మ తెలిపారు.