ఇవిఎంల నిషేధ పోరుకు మద్దతు ఇవ్వండి

ఉద్దవ్‌ థాకరేకు రాజ్‌థాకరే లేఖ

ముంబయి,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): ఎన్నికల సమయంలో ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఇవిఎంలు) ఉపయోగాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్న తమకు మద్దతునివ్వాల్సిందిగా తన బంధువు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్‌ ఉద్దవ్‌ ధాఖరేకు శివసేన చీఫ్‌ రాజ్‌థాకరే లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇవిఎంల ఉపయోగాన్ని నిలిపివేయకపోతే, అన్ని పార్టీలు కలిసి ఎన్నికలను బహిష్కరిస్తాయని లేఖలో పేర్కొన్నారు. రాజ్‌థాఖరే మాట్లాడుతూ ఇవిఎంల పేరుతో ఏదైతే జరుగుతుందో అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. ఇవిఎంల ద్వారా ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరుగుతుంటే, ఎన్నికల సమయం వృథా అయినట్లేననిఅన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు రాసిన లేఖలో ఇవిఎంలకు నిషేధించాలని డిమాండ్‌ చేయాల్సిందిగా కోరానన్నారు. ఉద్దవ్‌ రాసిన లేఖలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ కూడా లేఖలు రాశానని తెలిపానని అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వానికి కీలక మిత్రపక్షమైన శివసేన తరుచూ వివిధ సమస్యలపై దాడి చేస్తూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో స్వంతంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొంది.