ఇస్రోప్రయోగంతో ఇనుమడించిన ఉత్సాహం

శాస్త్రవేత్తల్లో వెల్లివిరిసిన ఆనందం

నెల్లూరు,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ): వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతం అయ్యింది. ఆదివారం రాత్రి నింగికెగిసిన ఉపగ్రహం సంకేతాలు ఆందాయని సమాచారం. దీంతో శాస్త్రవేత్తుల ఊపిరి పీల్చుకున్నారు. నిరంతరాయంగా 33 గంటల పాటు కౌంట్‌ డౌన్‌ అనంతరం శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ-సీ42 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్వీ-సీ42 వాహకనౌక ద్వారా బ్రిటన్‌కు చెందిన నోవాసర్‌, ఎస్‌ 14 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. నోవాసర్‌, ఎస్‌ 14 ఉపగ్రహాలు భూమికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ఈ రెండు ఉపగ్రహాలను సర్వే శాటిలైట్‌ టెక్నాలజీ రూపకల్పన చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఇస్రో చేపట్టిన ప్రయోగమిది. ఇస్రో ఛైర్మన్‌గా కె.ఎస్‌.శివన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మూడో ప్రయోగం.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదివారం యూకేకు చెందిన రెండు ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆదివారం రాత్రి పీఎస్‌ఎల్‌వీ-సి42 ద్వారా నోవాసర్‌, ఎస్‌1-4 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలను వెల్లడించారు. ఈ రెండు ఉపగ్రహాలు ప్రధానంగా భూమి పరిశీలన, వరదలు, విపత్తుల సమాచారం ఇచ్చేందుకు ఉపయోగపడతాయి. పీఎస్‌ఎల్‌వీ-సి42 ఆదివారం రాత్రి సరిగ్గా 10.08 నింగిలోకి దూసుకెళ్లింది. 17 నిమిషాల 45 సెకన్లలో ఉపగ్రహాలను భూమి నుంచి 583 కిలోవిూటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతంపై ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. యూకేకు చెందిన సర్రే శాటిలైట్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌(ఎస్‌ఎస్‌టీఎల్‌) రూపొందించింది. ఉపగ్రహంలో అమర్చిన ఆటోమెటిక్‌ ఐడెంటిఫికేషన్‌ రిసీవర్‌ హనీవెల్‌ ఏరోస్పేస్‌ వారు తయారు చేశారు. దీని ద్వారా అటవీ పరిశీలన, భూపరిశీలన, ఐస్‌ కవరింగ్‌ మానిటరింగ్‌, వరదలు, విపత్తుల గురించి తెలుసుకునే వీలుంది. ఉపగ్రహంలోని ఎస్‌ఏఆర్‌ పెలోడ్‌ను ఉపయోగించి సముద్ర వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేయవచ్చు. సముద్రంలో రాకపోకలు సాగించే నౌకలకు వాతావరణ సమాచారాన్ని అందజేయడంతోపాటు, వాటి గమనాన్ని కూడ అదే సమయంలో జాడను గుర్తిస్తుంది.

తాజావార్తలు