ఇస్రో చరిత్రలో మరో ఘగన విజయం

విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహకనౌక ప్రయోగం
కక్ష్యలోకి విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలు
శ్రీహరికోట,నవంబర్‌29(జ‌నంసాక్షి): ఇస్రో మరో ఘగన విజయం సాధించింది. మరో శాటిలైట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహకనౌకను గురువారం ఉదయం 9.58 గంటలకు విజయవంతంగా నింగిలోకి ప్రయోగించారు. నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగిన కౌంట్‌డౌన్‌ పక్రియ అనంతరం వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసుకుంది.   ఇమేజింగ్‌(హెచ్‌వైఎస్‌ఐఎస్‌)ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. యూఎస్‌కు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్టేల్రియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహంతో కలిపి 261.5 కిలోల బరువున్న 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి.
పీఎస్‌ఎల్వీ-సీ43 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.  మూడో దశ ప్రయోగం విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకేసారి నింగిలోకి 31 ఉపగ్రహాలను పంపించి రెండు కక్ష్యల్లో వాటిని విడిచిపెట్టనున్నారు. ఇందులో మన దేశానికి చెందిన 380 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం ‘హైసిస్‌’ ఉంది. మిగిలిన 30 ఉపగ్రహాల బరువు 641.5 కిలోలు. 17.35 నిమిషాలకు 636 కిలోవిూటర్ల ఎత్తులో మన దేశానికి చెందిన ‘హైసిస్‌’ను ధృవ సూర్యానువర్తన కక్ష్యలో విడిచిపెడుతుంది. ఆపై పీఎస్‌ఎల్వీ-సీ43వ రాకెట్‌తో శాస్త్రవేత్తలు అంతరిక్ష విన్యాసం చేయించనున్నారు.  పీఎస్‌ఎల్వీ-సీ43, ఒకేసారి 31 ఉపగ్రహాల ప్రయోగం మనదేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం  బరువు 380 కిలోలు కాగా దేశ రక్షణరంగ సేవలో ఐదేళ్లు పనిచేస్తుంది. భూ పరిశీలనకు, సముద్రంలో నావల కదలికలకు ఉపయోగపడే అమెరికాకు చెందిన ఎ/-లోక్‌ 3ఆర్‌ ఉపగ్రహాలు 16, గ్లోబల్‌-1, సీసీరో-8, 4 లేమూర్‌, హెచ్‌శాట్‌-1.ను కూడా నింగిలోకి పంపారు. ఆస్టేల్రియాకు చెందినది రిమోట్‌ ఇంటర్నెట్‌ సేవలకు ఉపయోగపడుతుంది.