ఇస్రో మరో రాకెట్‌ ప్రయోగం

నేటి రాత్రి నింగిలోకి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి42

శ్రీహరికోట,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): మరో ప్రయోగానికి ఇస్రో సిద్దమయ్యింది. ఆదివారం రాత్రి అద్భుత ప్రయోగానికి శ్రీకరాం చుట్టబోతున్నది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి42 ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ముందుగా నిర్ణయించిన మేరకు కాకుండా నిమిషం అలస్యంగా అంటే ఆదివారం రాత్రి 10.08 గంటలకు రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది. అంతరిక్షంలో వ్యర్థాలు అడ్డువచ్చే అవకాశం ఉండటంతో నిమిషం ఆలస్యంగా ప్రయోగం చేపడుతున్నారు. రాకెట్‌ ప్రయోగం చేయతలపెట్టిన ఆదివారం సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వర్షంతోపాటు ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని సూచించినట్లు సమాచారం. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎంతటి భారీ వర్షం కురిసినా ప్రయోగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఉరుములు, మెరుపులతో మాత్రం అప్రమత్తంగా ఉండాలని భావించారు. రాకెట్‌ ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన తర్వాత సుమారు ఒకటిన్నర కిలోవిూటరు వరకు మార్గం మధ్యలో మెరుపుల వంటివి అడ్డు రాకూడదు. అలా వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ పక్రియ శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రారంభం కానుంది. రిహార్సల్‌ కార్యక్రమం గురువారం నిర్వహించారు.

షార్‌లో శుక్రవారం సాయంత్రం రాకెట్‌ సన్నద్ధత సమావేశం(ఎంఆర్‌ఆర్‌), రాత్రి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశం(ల్యాబ్‌ విూటింగ్‌) జరిగాయి. ఈ సమావేశాల్లో శాస్త్రవేత్తలు పలు అంశాలపై చాలాసేపు చర్చించినట్లు తెలిసింది. అనంతరం వివిధ తనిఖీలు చేపటి ప్రికౌంట్‌డౌన్‌ చేపట్టారు. నిరంతరాయంగా కౌంట్‌డౌన్‌ 33 గంటలపాటు కొనసాగిన తర్వాత ఆదివారం రాత్రి 10.08 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి42 వాహక

నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. యూకేకు చెందిన 450 కిలోల బరువు ఉన్న నోవాసర్‌, ఎస్‌1-4 ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లనుంది.

తాజావార్తలు