ఇస్రో లో గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మూడవ లాంచ్ ప్యాడ్‌

 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇస్రో మరో లాంచ్ ప్యాడ్‌ను నిర్మిస్తున్నది. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మూడవ లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న రెండు లాంచ్ ప్యాడ్‌లు బిజీగా ఉన్నాయి. 2022లోగా భారత వ్యోమగామి అంతరిక్షంలో విహరిస్తారని స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ లో ప్రధాని మోడీ తెలిపారు. దానికి తగినట్టుగానే ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. ముగ్గురు భారత వ్యోమగాములను సుమారు 7 రోజుల పాటు అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం 2004 నుంచే ప్రయోగాలు నిర్వహిస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. స్పేస్ క్యాప్సూల్ రికవరీ, క్రూ మాడ్యూల్ అట్మాస్పియరిక్ రి ఎంటీ, ప్యాడ్ అబోర్ట్ లాంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. GSLV మాక్-3 వెహికల్ ద్వారా గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే ఈ ప్రయోగాన్ని కొత్త లాంచ్ ప్యాడ్ నుంచే ప్రయోగించనున్నారు. ఇంకా చిన్న తరహా ఉపగ్రహాలను నింగికి పంపేందుకు ఇస్రో మరో ప్రత్యామ్నాయ కేంద్రం కోసం ప్రణాళికలు చేస్తున్నది. గుజరాత్ తీరంలో ఓ లాంచ్ ప్యాడ్‌ను నిర్మించాలని భావిస్తోంది.

తాజావార్తలు