ఈనెల 10న ఇల్లందులో జరుగు సదస్సును జయప్రదం చేయండి * ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి
టేకులపల్లి, సెప్టెంబర్ 4( జనం సాక్షి ): ఈ నెల 10న సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఇల్లందులో జరిగే సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి పిలుపునిచ్చారు. సింగరేణి హైటెక్ కాలనీ, బెల్టు క్లీనింగ్ , రోడ్ క్లీనింగ్ కార్మికులతో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సోమవారం జర్పుల సుందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, కేసీఆర్ ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం ఇస్తానని రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన పర్మినెంట్ మాట దేవుడెరుగు బతకడానికి జీతం పెంచటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో అన్ని రకాల కాంట్రాక్టు కార్మికులకు జీతం పెంచి సింగరేణిలో వందల కోట్ల రూపాయల లాభాలకు ఈ కాంట్రాక్టర్ కార్మికులేనని ఇట్లాంటి కార్మికుల ఎడల సింగరేణి అధికారులు జీతాలు పెంచకుండా మొసలి కన్నీరు కారుస్తున్నా రన్నారు. కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పించాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన సింగరేణి రివ్యూ మీటింగ్ లు జరిగిన,వారి సిఎంఆర్ నిధుల కోసం ఆరాటమే తప్ప కార్మికుల కోసం ఒక్కరోజు మాట్లాడింది లేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వoలో సింగరేణి సొమ్ము రోడ్లపాలు డివైడర్ల ఫాలుఅవుతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల ఊసే ఎత్తడం లేదు అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10వ తారీఖున కాంట్రాక్టు కార్మికుల ర