ఈనెల 15,16వ తేదీలలో కేజీబీవీల ముందు నిరసన — టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

 

టేకులపల్లి, నవంబర్ 10 (జనం సాక్షి ): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్)రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కేజీబీవీ ఉపాధ్యాయునిల సమస్యల పరిష్కారానికై ఈనెల 15,16వ తేదీలలో మధ్యాహ్నం జిల్లాలోని అన్ని కేజీబీవీల ముందు జరిగే మొదటి దశ నిరసన ప్రదర్శనలో ఉపాధ్యాయునిలు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా గురువారం టేకులపల్లిలోని కేజీబీవీ నందు మధ్యాహ్నం మూడు దశల పోరాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. టిపిటిఎఫ్ ఈనెల 15,16వ తేదీలలో అన్ని కేజీబీవీల ముందు,ఈనెల 26న జిల్లా కలెక్టర్ రేట్ ముందు, డిసెంబర్ 3న డైరెక్టరేట్ హైదరాబాదులోని కార్యాలయం ముందు కేజీబీవీ ఉపాధ్యాయునిల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు దశల నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని , ఈ నిరసన కార్యక్రమాలకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయినీలు,సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయినీలను,సిబ్బందిని రెగ్యులర్ చేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉపాధ్యాయినీలకు 27 రోజుల సాధారణ సెలవులు మంజూరు చేయాలని,మేటర్నిటీ,హిస్టరీ సెలవులు ఇవ్వాలని, ఉపాధ్యాయినీలను రాత్రి విధులనుండి తొలగించి వారి స్థానంలో మ్యాట్రిన్లను నియమించాలని,హెల్త్ కార్డులు ఇవ్వాలని,కళాశాలలో అదనపు సిబ్బందిని నియమించాలని,రాత్రి కాపలాకు వాచ్మెన్లను నియమించాలని,రిపేర్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలని,బదిలీలు నిర్వహించాలని,ఎస్ఓలను మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వహణ బాధ్యతల నుండి తొలగించాలని,కేజీబీవీలలో నీటి, విద్యుత్ సౌకర్యాలన