ఈ ఖరీఫ్‌లోనూ తప్పని కష్టాలు
ఆదిలాబాద్, జూన్ 12 (జనంసాక్షి): ప్రతి ఖరీఫ్‌లో రైతులు ఏదో ఒక సమస్యతో సతమత మవుతున్నారు. గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితు ల వల్ల పంటల దిగుబడి తగ్గిపోయి, చేతికి వచ్చి న పంటలకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్ట పోయారు. ఈ ఖరీఫ్‌లో పెరిగిన విత్తనాలు, ఎరు వులు ధరలతో దిగులుపడుతున్నారు. ఈ ఖరీఫ్ లోనైనా కోలుకుంటామనుకుంటున్న రైతాంగానికి ఎరువుల, విత్తనాలు ధరలు రెట్టింపు కావడంతో ఎకరానికి రెండు వేల రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. జిల్లా సాదారణ సా గు విస్తీర్ణం 5.25 లక్షల హెక్టార్లు కాగా ఈ ఖ రీప్‌లో 6.50 లక్షల హెక్టార్లలో పంటు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తిపంట సాగు అవుతుంది. జిల్లాలో ఈ సంవత్సరం 920 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికి 165 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఖరీప్ పనులు ప్రారంభమైన రుణాలు మాత్రం రైతులకు అందక చాలా ఇబ్బం దులు పడుతున్నారు. సకాలంలో రుణాలు మం జూరు చేస్తామని అధికారులు ప్రకటించినప్ప టికి రుణాలు రాకపోవడంతో రైతులు దళారుల ను ఆశ్రయించాల్సి వస్తుంది. పెట్టుబడి రెట్టింపు అయిన కష్టపడి పంటలను సాగుచేస్తే వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర దొరుకుతుందో లేదో అన్న భయం రైతులను వెంటాడుతోంది. గత ఏడాది పత్తి, పసుపు, మిరప, వరి తదితర పం టలకు ఆశించిన మేర ధర లభించక రైతులు తీ వ్రంగా నష్టపోయారు.