ఈ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి..
సిరియాకు చెందిన ఓ బాల శరణార్ధి టర్కీ సముద్ర తీరానికి కొట్టు వచ్చిన సంఘటనకు ఐక్యరాజ్యసమితి ఇది హృదయ విదారకం అని తెలిపింది. అంతేకాక ఐక్యరాజ్య సమితి హై కమీషనర్ శరణార్ధుల పునరావాసానికి పిలుపునిచ్చింది. సిరియా దాడుల్లో లక్షకు పైగా ప్రజలు మరణించడంతో అక్కడి ప్రజలు దాడులకు తాళలేక మరో ప్రదేశానికి వలుసలు వెళ్తాన్నారు. ఈ తరుణంలో ఓ బాల శరణార్ధి టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన వైనం ప్రపంచాన్ని కలచివేసింది. దీంతో దాదాపు 2 లక్షల మంది శరణార్ధులను ఐరోపా దేశాలు తమ మధ్య ఉంచుకోవాలని ఐరాస శరణార్ధుల కమీషనర్ ఆంటోనియో గుటెర్రెస్ ఓ ప్రకటనలో కోరింది. ఆఫ్రికా నుండి శరాణార్ధులు వెల్లువెత్తుతుండటంతో ఐరోపా ప్రభత్వాలు సైతం వలస సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నేడు ఈయూ దేశాలు వలస సంక్షోభంపై చర్చించడానికి ఈయూ విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు.ఈ నేపథ్యంలో ఐరాస హై కమీషరన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాల శరణార్ధి ఐలన్ కుర్ధీ ఉదంతాన్ని గుర్తుకు తెస్తూ ఆ ఘటన హృదయ విదారకం అంటూ గుటెర్రెస్ వ్యాఖ్యానించారు. వలసల సంక్షోభాన్ని పరిష్కరించడానికి అరకొర చర్యలతో సరి పెట్టొద్దని ఐరోపాకు ఆయన హితువు పలికారు. ఒంటరిగా ఏ ఒక్క దేశం కూడా ఈ సమస్యను పరిష్కరించజాలదని, అదే సమయంలో ఏ ఒక్క దేశం ఈ బాధ్యతల నుంచి తప్పించుకోకూడదని ఆయన చెప్పారు.