ఈ జూ ప్రత్యేకత ఏంటంటే..?

సాధారణంగా ‘జూ’కి వెళితే క్రూర జంతువులు బోనుల్లో కనబడుతుంటాయి. వాటిని చూస్తూ సందర్శకులు ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ చైనాలోని ఓ జూలో మాత్రం మనుషులు బోనుల్లో ఉంటే.. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..?

చైనాలోని చొంగ్‌కొంగ్‌లో లెహె లెదు వైల్డ్‌లైఫ్‌ జూని గతేడాది ప్రారంభించారు. 22brk64cఇందులో సింహాలు.. పులులు.. ఎలుగుబంట్లు ఇలా అన్ని జంతువులు స్వేచ్ఛగా అడవిలో ఉన్నట్లుగానే ఉంటాయి. వాటిని చూడాలంటే బోనులా ఉండే వాహనంలో ఉండి జూ మొత్తం తిరగొచ్చట. అంతేకాదు మన దగ్గరకు వచ్చిన జంతువులకు ఆహారం కూడా అందజేసే సదుపాయం కూడా ఉంది.

మిగిలిన వాటితో పోల్చితే తమ జూ విభిన్నంగా ఉండాలని.. అక్కడికి వచ్చిన సందర్శకులకు గొప్ప అనుభూతిని కలిగించే విధంగా ఉండాలని అలా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే వాహనంలో వెళుతున్నపుడు చేతులు.. వేళ్లు బయట పెట్టవద్దని సూచిస్తున్నారు.

ఏదైతేనే పులులు.. సింహాలు వంటి క్రూర జంతువులను సైతం చాలా దగ్గరగా ఉండి చూసే అవకాశం రావడంతో ఈ జూకి సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగిందట.