ఈ నెల 12 నుంచి తెలంగాణ క్రికెట్ టోర్నీ
ముదోల్ : మండలంలోని తరోడ గ్రామంలో ఈ నెల 12 నుంచి తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సీహెచ్ అనిల్, వాజిద్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గోనే వారు ఈనెల 11 లోగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలను మొదటి బహుమతిగా రూ. 7000 ద్వితీయ బహుమతి రూ. 4000ల నగదును అందజేయనున్నట్లు తెలిపారు.