ఈ నెల 21 నుంచి ఆటవీశాఖ ఉద్యోగాలకు పరీక్షలు
విద్యానగర్, ఆటవీశాఖలో ఉద్యోగాల కోసం గతనెలలో జరిగిన ధ్రువపత్రాల పరిశీలన, శరీరక కొలతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి రాత పరీక్షలు జరుగుతాయని ఆటవీ మండలాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్ 1లో వ్యాసరచన సమయం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు ఉంటుందని తెలిపారు. పేపర్.2లో జనరల్ నాలెడ్జ్ సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 వరకు ఉంటుంది. పేపర్.3లో సాధారణ లెక్కలు మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. సకాలంలో హల్ టికెట్లు అందని అభ్యర్థులు ఈనెల 19, 20 తేదీలలో ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో వచ్చి సంబంధిత ఆటవీ ఆధికారి కార్యాలయంలో సంప్రదిచాలని కోరారు.