ఈ నెల 9 నుండి 12 వరకు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్

సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 7;(జనం సాక్షి): ఈనెల 9నుండి 12 వరకు  జహీరాబాద్ మండలం రంజోల్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 8వ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్(మల్టీ జోన్-2) ను ఈనెల 9 నుండి 12 వరకు నిర్వహించనున్నట్లు రంజోల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి స్పోర్ట్స్ మీట్ లో రాష్ట్రంలోని 56 గురుకుల పాఠశాలల నుండి 882 మంది బాలికలు పాల్గొన
నున్నట్లు తెలిపారు.
కబడ్డీ ,కోకో ,వాలీబాల్ ,హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, టేన్ని కాయిట్(డబుల్), చెస్ (సింగిల్), క్యారమ్స్ (డబుల్) పోటీలు జరుగుతాయని తెలిపారు.
అదేవిధంగా అథ్లెటిక్స్ లో వంద,200,400,600,800,1500,3000 మీటర్లు, షాట్ పుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, హై జంప్ తదితర పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.
ఇట్టి స్పోర్ట్స్ మీట్ ను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు బేబీ పాటిల్, జహీరాబాద్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జడ్పీ చైర్ పర్సన్, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ పాల్గొంటారని  తెలిపారు.