ఈ శ్రామిక మహిళలకు కూర్చునే హక్కు కూడా లేదా!
కొందరి సమస్యలు ..చూసే వారికి పెద్ద సమస్యగా అనిపించదు. కొన్ని కష్టాలు చూస్తే తెలియదు ..అనుభవిస్తేనే అర్థమవుతుంది. షాపింగ్ మాల్స్‌లో రోజంతా నిల్చుని పనిచేసే శ్రామిక మహిళలు పడే ఇబ్బందులు కూడా అలాంటివే. చిరునవ్వుతో కస్టమర్లకు ఆహ్వానాలు పలుకుతారు. కానీ, ఆ నవ్వుల వెనుక ఎంతటి విషాదం ఉందో తెలిస్తే హృదయాలు బరువెక్కక మానవు. ఇప్పుడు పండగ ల సీజన్ నడుస్తోంది.. దేశమంతా పండుగల సంబరాలే కానీ ఆ మాల్స్‌లో పని చేసే మహిళలకు పండగ పూట కుటుంబంతో కలిసి భోంచేసే అదృష్టం కూడా లేదు. ఇంతకూ వారి సమస్యలేంటో చూద్దాం.. షాపింగ్ మాల్స్, బట్టల షాపులు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో పనిచేసే మహిళలు ఎప్పుడూ నిల్చునే కనిపిస్తారు. పక్కన కనీసం కూర్చోవడానికి స్టూలుకానీ, కుర్చీ కానీ కనపడదు. ఇవేవీ మనకు పట్టదు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి వచ్చింది మొదలు రాత్రి 9 గంటలకు డ్యూటీ దిగేంత వరకు సుమారు 12 గంటల పాటు కంటిన్యూగా నిలబడే ఉండాల్సిన ఉద్యోగం వారిది. మహిళలు షాపింగ్‌మాల్స్‌లో కూర్చునే హక్కును కల్పిస్తూ దేశంలో మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఆ తరువాత తమిళనాడు ప్రభుత్వం కూర్చునే హక్కును కల్పిస్తూ చట్టం చేసింది. కేరళ చట్టంలో ప్రతి కార్మికునికి వారానికి ఒకరోజు సెలవుదినంగా ఇవ్వాలని, మహిళా కార్మికులను రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేయించరాదని పేర్కొన్నది. తప్పనిసరి పరిస్థితులు ఎదురైనప్పుడు ఐదుగురు కార్మికులు ఓ గ్రూపుగా ఉండాలి. అందులో ఇద్దరు మహిళలు ఉండాలి. వారికి తగిన రక్షణ కల్పించాలి. ఇంటి వరకూ రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పబడిరది. షాపుల్లో నిలబడి పని చేసే వారికి వారి పని ప్రదేశాలలో కూర్చోవటానికి సౌకర్యం కల్పించాలని స్పష్టంగా చట్టంలో వివరించబడిరది. మన రెండు తెలుగు రాష్టాల్రలో ఇది హక్కుగా, చట్టంగా లేకపోవడం విచారకరం. తక్షణం ఈ సమస్యపై రెండు ప్రభుత్వాలు చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్టాల్రలో వందలాది షాపింగ్ మాల్స్, జ్యూవెలరీ మార్టులున్నాయి. వీటిలో వేలాది మంది శ్రమజీవులు ఉపాధికై పని
చేస్తున్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు ఇవ్వటం లేదు. గంటలకొద్దీ నిలబడటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. అత్యధిక చోట్ల మహిళలకు కూర్చునే సౌకర్యం లేదు. కస్టమర్లు లేనప్పుడు కూడా కూర్చునేందుకు లేదు. ఈ మహిళలకు నిలబడి ఉండటం కారణంగా మూత్రాశయ వ్యాధులు, కాళ్లపై వెరికోస్ వెయిన్స్ (నరాలు ఉబ్బటం) వ్యాధి, వెన్నుపూస, నుడుమునొప్పి వంటి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. కొన్ని మాల్స్‌లో 10 నిమిషాలు మాత్రమే వాష్‌రూమ్‌కు వెళ్లాలనే నిబంధన ఉంది. బాత్రూమ్కు వెళ్లిన ప్రతిసారి బయోమెట్రిక్‌లో నమోదు చేయాలి. కార్మికులు లిప్ట్ ఎక్కడానికి వీలు లేదు. ఎన్ని సార్లయినా, ఎన్ని అంతస్తులైనా మెట్లపై నడవాల్సిందే. పీరియడ్స్ సమయంలో మహిళల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కార్మికులకు భోజనాలు చేయడానికి సౌకర్యాలు లేవు. టాప్ఎª`లోర్‌లో వాష్రూముల దగ్గర భోజనాలు చేస్తుంటారు. వీరికి పని ఎక్కువ, వేతనం తక్కువ. కొనుగోలుదార్లు చూసిన బట్టలు, వస్తువులను సర్దటమే వీరి ప్రధాన పని. రూ.6 వేల నుంచి 14 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. పెద్ద మాల్స్‌లో కనీస వేతనం, ఇఎస్ఐ, పిఎఫ్‌లు అమలు చేస్తున్నా పని గంటలు చట్ట ప్రకారం అమలు చేయటం లేదు. కార్మికులకు ప్రోత్సాహకాలు, బోనస్ పేరుతో పోటీ పెంచుతున్నారు. ఒక్కో అంతస్తులో ప్రతి రోజూ ’మంచి ఉద్యోగి’ పేరిట ఎంపిక చేస్తారు. ఇందుకోసం అమ్మకాలు పెంచాలంటూ విపరీత మైన టార్చర్ ఉంటుంది. తెలుగు రాష్టాల్రలో ఎక్కడా 8 గంటల పని విధానం అమలు కావటం లేదు. 10 నుంచి 12 గంటలపాటు కనీసంగా వీరు పని చేయాల్సి వస్తున్నది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు రోజులో రాక పోకలు కలుపుకుంటే 14 నుంచి 16 గంటలు ఈ పనిలో ఉండాల్సి వస్తున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెలవులు అమలు కావటం లేదు. ఒక్కరోజు సెలవు తీసుకుంటే రెండు రోజుల వేతనాన్ని కత్తిరిస్తున్నారు.కేరళ, తమిళనాడు తరువాత దేశంలో ఎక్కడా ఇది చట్టంగా రూపుదాల్చలేదు. మహిళోద్దారకులు గా తమను తాము కీర్తించుకునే తెలుగు ముఖ్యమంత్రులకు ఈ సమస్య పట్టడంలేదు. విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ లాంటి నగరాలలో వీరి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇక, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల సమస్య కూడా తీవ్రమైన అంశంగా ఉంది. తక్షణం వీరి సమస్యలకు పరిష్కారాన్ని చూపించాల్సిన బాధ్యత ఉభయ రాష్టాల్ర తెలుగు ప్రభుత్వాలపై ఉంది..