ఉక్రెయిన్‌లో ఇంకా కష్టాలు పడుతున్న పలువురు
తమకు తిండి కూడా దొరకడం లేదంటూ ఆందోళన
న్యూఢల్లీి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): ఉక్రెయిన్`రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ
విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన యువతి కడారి సుమాంజలి ఉక్రెయిన్ లో ఇక్కట్లు పడుతోంది. ఆమె అవస్థలు అన్నీ ఇన్నీకావు. 4 రోజుల నుంచి ఆహారం కూడా లేదని ఆమె ఆవేదన చెందుతోంది. కూతురి కష్టాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఎంబసీ అధికారులు భోజన సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. తమ కూతురు రూంలో వుందన్నారు సుమాంజలి తల్లి. అక్కడి పరిస్థితి బాంబులు పడుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లో వున్నా.. సరైన వసతి లేదు. బోర్డర్ రావడానికే
అవకాశం లేదంటోంది సుమాంజలి. బాంబు చప్పుడు వినిపిస్తే బంకర్లలోకి వెళుతున్నారు. షాపుల్లో ఏం దొరకడం లేదన్నారు. కేంద్రం వెంటనే స్పందించాలని, క్షేమంగా ఇంటికి చేర్చాలంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో సుమాంజలి ఇరుక్కుపోయింది. అక్కడినించి సరిహద్దులు దాటాలంటే 800 కిలోవిూటర్లు దూరం వుందన్నారు సుమాంజలి అన్న. మరోవైపు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. బుడాఫెస్ట్ నుంచి ఢల్లీికి చేరుకుంది ప్రత్యేక విమానం. ఢల్లీికి చేరుకున్నారు 240 మంది భారతీయులు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 1346 మంది భారతీయులను తరలించారు.