ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి తరలింపు
విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా
న్యూఢల్లీి,మార్చి3(జనం సాక్షి): ఉక్రెయిన్`రష్యా యుద్ధం ప్రభావం అన్నింటా పడుతోంది. ఇప్పటికి ఇంకా 8 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా సి“17 లాంటి భారీ రవాణా విమానాల్లో రుమేనియా, పోలండ్, హంగేరీల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తరలింపు పక్రియ కొనసాగుతోంది. రష్యా సేనల అధీనంలో ఉక్రెయిన్ లోని ఖేర్సన్ పట్టణ కేంద్రం వుంది. దీంతో అక్కడ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దాడులు ప్రారంభమైన తర్వాత రష్యా అధీనంలోకి వెళ్లిన తొలి పట్టణం ఖేర్సన్. అజోవ్ సముద్ర తీరంలోని కీలక మరియుపోల్ ఓడ రేవుని చుట్టుముట్టిన రష్యా సేనలు యుద్దానికి రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్ దేశాన్ని, ప్రజలను, దేశ చరిత్రను ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రష్యా ప్రయత్నం చేస్తుందని నిందించారు అధ్యక్షుడు జెలెన్ స్కీ. రష్యా దాడుల తర్వాత ఇప్పటివరకు సుమారు 9 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు దేశాన్ని వీడి వెళ్ళారని చెప్పింది ఐక్యరాజ్య సమితి. అటు పోలాండ్ లో చిక్కుకుపోయిన 400 మంది తెలుగు విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. చలి మంచు ఎక్కువగా వుండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం తరపున కమ్యూనికేట్ చేసే వారు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిని త్వరగా తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉక్రెయిన్ నుంచి ఢల్లీి విూదుగా విజయవాడకు ఇండిగో విమానం చేరుకుంది. ఈ విమానంలో విజయవాడ ఉక్రెయిన్ విద్యార్థులు హారతి, రమ్యశ్రీ, అజయ్ చేరుకున్నారు.