ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబుల్ మీదుగా ఢిల్లీకి వచ్చారు. వారికి కేంద్ర మంత్రి జింతేంద్ర సింగ్ విమానాశ్రయంలో ఆహ్వానం పలికారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు.. తాము భారత్ చేరుకున్నామని ఇప్పటికే నమ్మడంలేదని చెప్పారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి ఆపరేషన్ గంగను (Operation Ganga) చేపట్టించింది. ఇందులో భారతీయ వాయుసేన భాగమయింది. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా వంటి విమానయాణ సంస్థలు ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకువస్తున్నాయి. అయితే అక్కడ పరిస్థితులు రోజురోజుకు దిగజారుతుండటం, చిక్కుకుపోయినవారి తరలింపు ఆలస్యమవుతండటంతో తాజాగా వాయుసేన రంగంలోకి దిగింది. ఇందులో భంగా వాయుసేనకు చెందిన సీ-17 రవాణా విమానం రొమేనియా బయల్దేరి వెల్లింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ఉన్న హిండన్ ఎయిర్‌బేస్ నుంచి రొమేనియాకు వెళ్లింది.