*ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన*
మునగాల, ఆగష్టు 7(జనంసాక్షి): గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతోనే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా సూర్యాపేట ఆర్వీ ఫెర్టిలిటీ&కార్డియక్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని న్యూప్రజ్ఞ స్కూల్ నందు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన వైద్యులు గుండె, కిడ్నీ, మధుమేహం, బీపీ, న్యూరో, గ్యాస్ర్టో, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. 10 మంది వైద్యులతో కూడిన బృందం సుమారు 200 మందికిపైగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు అలక ప్రేమ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారన్నారు. చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. వేల మంది ప్రజలతో వారి జీవన సామాజిక, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక్ష అనుభవం ఉన్న కారణంగా ప్రజల అవసరాలకు తగిన రీతిలో, అత్యాధునిక వైద్య సదుపాయాలతో సూర్యాపేటలో ఆర్వీ ఫెర్టిలిటీ& కార్డియక్ హాస్పిటల్ స్థాపించటం జరిగింది అన్నారు.
ప్రజలకు ఆరోగ్య సహాయకరంగా అన్ని మండలాలు, గ్రామాల్లో వీలుని బట్టి భవిష్యత్తులో ఇలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, అంజయ్య గౌడ్, కంసాని కృష్ణమూర్తి, అమరగాని సుమన్, హాస్పిటల్ సిబ్బంది వేణు గౌడ్, సాగర్ గౌడ్, సాయి కృష్ణ, వేణు, చందు, రాజలక్ష్మి, శారద, సురేష్ తదితరులు పాల్గొన్నారు.