ఉచిత విద్యుత్ ప్రకటన సాహసమే : మంత్రి డొక్కా
హైదరాబాద్ : ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు బిల్లు చెల్లించనక్కరలేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ శనివారం ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఉచిత విద్యుత్ నిర్ణయం చాలా సాహసంతో కూడిన చారిత్రాత్మక నిర్ణయయని ఆయన అన్నారు. వీటితో పాటు విద్యుత్ పాత బకాయిలను రద్దు చేయడం హర్షనీయమన్నారు. ప్రతిపక్షాలు ఇకనైనా నిరసనలు విరమించుకోవాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది ఎస్సీ. ఎస్టీ కాలనీల్లో రూ. 1000-1500 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.