ఉచిత వైద్యశిబిరంలో వస్త్రదానం
చిత్తూరు,జూలై17(జనం సాక్షి): చిత్తూరు నగరి నియోజకవర్గం 26వ గురుపాద వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నగరి ఆది పరాశక్తి ఆధ్యాత్మిక సంస్థ తరుఫున ఆలయ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని నగరి కస్తూరి కళ్యాణమండపంలో ఏర్పాటు చేశారు. 50 మంది పేద వారికి వస్త్ర దానం, ముగ్గురికి ఉచిత టైలరింగ్ మిషిన్‌లు, ప్రత్యేక వైద్య బృందం చేత వయసు పైబడిన వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు జ్యోతి నాయుడు, ముత్తు ,రాజా,పెరుమాల్ ,వినోద్ , ఆనంద్, ఇతర ఆదిపరాశక్తి భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆది పరాశక్తి జిల్లా అధ్యక్షులు గంగాధరం , నగరి అగ్నిమాపక అధికారి మాబు సుభాన్, ఐసిడిఎస్ అధికారిణి శారదా, శాంతి హాస్పిటల్ చైర్మన్ హరీష్, లోకనాథ ఆచారి , దేశమ్మ గుడి ఈవో ముని కిష్టయ్య , పోస్టుమెన్ శరత్ కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు