ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి)

కస్తూరిభా గాందీ విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాదించి భవిష్యత్తులో తమ లక్ష్యాలు నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. మంగళవారం కస్తూరిభా గాందీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ సందర్భంగా పాఠశాల, కళాశాల తరగతులను సందర్శించి విద్యార్డులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్దులకు పలు సూచనలు చేశారు. కస్తూరిభా గాందీ విద్యాలయాల్లో మెరుగైన వసతులు ఉన్నాయని విద్యార్దులు తమ తల్లి తండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నారని వారికి అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వ పరంగా సమకూరుస్తున్నామని, విద్యార్దులు ఏకాగ్రత కలిగి ఉత్తమ ఫలితాలను సాదించాలని కలెక్టర్ అన్నారు. ఈ సవత్సరం పదవ తరగతి పరిక్షల్లో కస్తూరిభా గాందీ విద్యార్దులు 10/10 ర్యాంకులను అధిక సంఖ్యలో సాదించాలని కలెక్టర్ అన్నారు. అనంతరం కళాశాల తరగతిని సందర్శించి ఎంపిసి,బైపిసి విద్యార్దులతో మాట్లాడి వారి యొక్క లక్ష్యాలను, ఆశయాలను తెలుసుకుని భవిష్యత్తులో ఉన్నత విద్యలో రాణించేలా పలు సూచనలు చేశారు. ఎంపిసి,బైపిసి విద్యార్దులకు ప్రత్యేక కోచింగ్ కూడా అందిస్తామని నీట్, ఎఐఈఈఈ లకు హాజరయ్యే విధంగా ముందస్తుగాను మానసికంగా సిద్దం కావాలని కలెక్టర్ అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల హై, కస్తూరిభా గాందీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారిని బి. భవాని తహసిల్దార్ నాగభవాని, కో ఆర్డినేటర్, మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.