ఉత్తమ విద్యార్థులకు ప్రైవేట్ గాలం
తమ కాలేజీల్లో చేరాలని ఒత్తిడి
అంతా ఉచితమేనంటూ తాయిలాలు
హైదరాబాద్,మే19( జనం సాక్షి): లక్షల రూపాయలు ఇస్తే కానీ సీటు ఇవ్వని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులకు తాయిలాలు ఇచ్చి కళాశాలల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండేళ్లు ఇంటర్‌లో ఉచిత చదువు, హాస్టల్ వసతి, ఇతర ఫీజులు కూడా తామే చెల్లిస్తామని ప్రచారం చేస్తున్నాయి. ఇందు కోసం కళాశాలల ఏజెంట్లు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు నడుపుతున్నారు. అన్ని వసతులతో కూడిన హాస్టల్, ఉత్తమ విద్య అందిస్తామని చెబుతుండటంతో విద్యార్థుల తల్లిదం డ్రులు సంకటంలో పడుతున్నారు. అత్యధిక జీపీఏలు సాధించిన విద్యార్థులపై కార్పొరేట్ కళాశాలలు దృష్టి మళ్లించారు. ఉత్తమ ప్రతిభావంతులను తమ కళాశాలల్లో చేర్పించేందుకు తహతహలా డుతున్నారు. తెలివైన విద్యార్థుల జాబితా సేకరించడంతోపాటు తమ ఏజెంట్ల ద్వారా ఇంటింటికి వెళ్లి కళాశాలల్లో చేరమంటూ వత్తిడి చేస్తున్నారు. పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు గాలం వేస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ఉన్న ప్రైవేట్ కళాశాలలు ముమ్మర ప్రచారం సాగిస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభను చాటిన విద్యార్థులకు గాలం వేస్తున్నాయి. కార్పొరేట్ కళాశాలలు తల్లిదండ్రులకు తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కార్పొరేట్ తరహాలోనే ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్ల కోసం ఆరాట పడుతున్నారు. విద్యార్థుల జాబితా సేకరించి తమ కళాశాలలో చేరమని ఫోన్లు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావటంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పదికి పది గ్రేడ్ సాధిం చిన విద్యార్థులను ఎలాగైనా చేరుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు చేసున్నారు. తమ తమ కళాశాలలో చేరాలంటూ.. పోటాపోటీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. హాస్టల్ వసతి, ఇతర ఫీజులు కూడా తామే భరిస్తామని ఆశలు కల్పిస్తున్నారు. ఇందు కోసం కళాశాలల ఏజెంట్లు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు నడుపుతున్నారు. ఈ సారి జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయి. కొన్ని ఉన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రతిభావంతులను చేర్చుకుంటే.. ఇంటర్‌లో అదే విధమైన ప్రతిభను కనబరుస్తారని, దీంతో కళాశాలకు మంచి పేరు తేవడం, దీని ఆధారంగా అడ్మిషన్లు పెరుతాయని కార్పొరేట్ కళాశాలల యాజమాన్యం అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం, లోకల్‌బాడీ, మోడల్ స్కూల్, కేజీబీవీ, ఇతర ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు.
———-