ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) ఘోర ప్రమాదం జరిగింది. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 11 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మరో వ్యక్తి గాయపడ్డారని, వారిని చంపావత్ జిల్లా దవాఖానకు తరలించామని చెప్పారు.
బాధితులంతా సోమవారం రాత్రి తనక్‌పూర్‌లోని పంచముఖి ధర్మశాలలో జరిగిన ఓ వివాహక వేడుకకు హాజరయ్యారని పోలీసులు చెప్పారు. అనంతరం తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తుండగా.. మంగళవారం తెల్లవారుజామున వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లిందన్నారు. ఈ ఘటనపై కేసు కాగా, ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.