ఉత్సాహంగా తీజ్ పండుగ వేడుకలు
తూర్పు గూడెంలో అట్టహాసంగా తీజ్ పండుగ
టేకులపల్లి ,ఆగస్టు 15( జనం సాక్షి) : బంజారా సంస్కృతి తీజ్ పండుగ ను బంజారా లు గిరిజన సాంప్రదాయాలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు .ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలో పెగళ్లపాడు గ్రామ పంచాయతీ తూర్పుగూడెం తండాలో సోమవారం బంజారా సంస్కృతి తీజ్ పండుగ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్ పాల్గొన్నారు. బంజారాల సంస్కృతి సాంప్రదాయాలకు తీజ్ పండుగ ఎంతో ప్రాముఖ్యమైనదని అన్నారు. ఈ సందర్భంగా మహిళలు యువతులు ,యువకులతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ నాయకులు బానోతు రామానాయక్ , బానోత్ కిషన్ నాయక్, మండల అధ్యక్ష,కార్యదర్శి బొమ్మెర వరప్రసాద్ ,బొడా బాలు నాయక్,రైతు బంధు సమితి అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గూగులోతు కృష్ణ,మండల ప్రచార కార్యదర్శి జాటోత్ నరేష్ నాయక్,ఇస్లావత్ బాలు నాయక్,యువజన అధ్యక్షులు బర్మావత్ శివకృష్ణ,తండా నాయకులు అంగోత్ లచ్చా నాయక్, బానోత్ రాందాస్, లునావత్ భద్రు,గ్రామ శాఖ కార్యదర్శి జార మల్లయ్య,మండల నాయకులు, బాలక్రిష్ణ, ఆనంతుల శ్రీను,బానోత్ రవి కుమార్, రవీందర్,కొత్త చిట్టి రాజు,మూడ్ బాలు, దరావత్ బిక్షం, రాజేష్, శివ,ముఖ్యకార్యకర్తలు,తండా యువతి, యువకులు, మహిళలు, నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఊరేగింపు చేసి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.