ఉద్థృతంగా మారిన పెన్‌గంగ వరద

ఆదిలాబాద్‌: జిల్లాలోని సిర్పూర్‌(టి) మండలంలో పెన్‌గంగ వరద ఉద్థృతంగా మారింది. దీంతో సుమారు 100 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కౌటాల మండలంలో 300 ఎకరాల్లోని పత్తి, సోయా పంటలు ముంపునకు గురయ్యాయి. తాటిచెట్టు వర్రె వంతెనపై నీరు నిలిచిపోవడంతో కౌటాల, బెజ్జూరు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.