ఉద్యమంతోనే రాష్ట్రం సాధ్యం
ఆదిలాబాద్, అక్టోబర్ 30 : ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 1031వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యమాల ద్వారానే రాష్ట్రం సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని, ఆ మేరకు తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీల నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేసి, ఉద్యమంలోకి కలిసి రావాలని వారు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా సాకులు చెబుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తామని వారు హెచ్చరించారు.