ఉద్యమం మరింత తీవ్రం
ఆదిలాబాద్, జూలై 28 : కేంద్రం తెలంగాణ విషయంలో స్పందించకపోతే వచ్చే నెలలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రజల వాణిని వినిపిస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 937వ రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ ప్రజల మనోభావాలను వినిపించడంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని వారు ఆరోపించారు. ప్రజా ఉద్యమం ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని అన్నారు. కేంద్రం ఆగస్టు మాసంలో స్పష్టమైన ప్రకటన చేయకపోతే ప్రజలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారని జరిగే పరిణామాలకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.