ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29 : ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1030 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కమిటీలు, సమావేశాలతో రాష్ట్రం సాధ్యం కాదని కేంద్రం, వీటిని ఆసరాక చేసుకొని జాప్యం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం మాటలకు మోసపోకుండా అన్ని పార్టీల నాయకులు తమ పదవులను త్యాగం చేసి ఉద్యమంలోకి కలిసి రావాలని డిమాండ్‌ చేశారు.