ఉద్యమాలతో రాష్ట్రం సాధ్యం
ఆదిలాబాద్, జనవరి 1 (): అడిగితే.. తెలంగాణ రాదని, ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని జైనత్ మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నా టిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. తెలంగాణ విషయంలో టిడిపి, కాంగ్రెస్, వైయస్సార్ సీపీలు మోసపూరిత ప్రకటనలో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్ని త్యాగాలకైనా టీఆర్‌ఎస్ సిద్ధమేనని అన్నారు. రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల ప్రజలు కలిసి గట్టుగా ఉద్యమిస్తే రాష్ట్రం సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు కోమారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.