ఉద్యమించే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10 : కేంద్రాన్ని యాచించకుండా ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టిన రిలే దీక్షలు శనివారంనాటికి 1042వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకాలం కేంద్రం మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చిందని విమర్శించారు. ఇక ఏమాత్రం కేంద్రం మాటలు నమ్మకుండా ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉద్యమంలో కలిసిరావాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో   టిడిపి, కాంగ్రెస్‌లు అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని, తమ వైఖరిని మార్చుకోకపోతే ఆ పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు.