ఉద్యాన పంట సాగు లాభదాయకం

 సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ జిల్లా అధికారి కన్న జగన్

మునగాల, జూలై 9(జనంసాక్షి): ఉద్యాన పంటల సాగు లాభదాయకమని సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ జిల్లా అధికారి కన్న జగన్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలోని యువరైతు శాఖమూడి అరవింద్ వ్యవసాయ క్షేత్రాన్ని కేంద్ర జల శక్తి అభియాన్ బృందం డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారి మార్చాంగు వర్తింగు, శాస్త్రవేత్త ఆర్.కె మీనాతో కలిసి సందర్శించారు. వ్యవసాయ క్షేత్రంలో గల పలురకాల ఉద్యాన పంటలైన ఖర్జూర గోల్డెన్ సీతాఫలం పందిరిపై తీగజాతి కూరగాయల సాగు, బిందు సేద్యం మల్చింగ్ విధానాలను పరిశీలించారు. మూడు సంవత్సరాల క్రితం నాటిన ఖర్జూర ప్రస్తుతం కాత దశకు వచ్చింది. ఉద్యాన పంటను సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు అరవిందును అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీకి నీటిని పొదుపుగా వాడుకుని అవలంబించే విధానాలను సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త పంటలకు సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి పెంటయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ ఏవో, గ్రామసర్పంచ్ నంద్యాల విజయలక్ష్మి, ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, కార్యదర్శి అక్షిత గ్రామ రైతులు శాఖమూడి పెద్ద నాగేశ్వరరావు, పాపిరెడ్డి, కృష్ణయ్య, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.