ఉద్రిక్తంగా మారిన వీఆర్వోల ధర్నా

. నల్గొండ టౌన్ జనం సాక్షి .
 జిల్లా కేంద్రంలో వీఆర్ఏల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వయించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్టంగా మారింది.కలెక్టరేట్ లోకి వెళ్లేదందుకు ప్రయత్నం చేశారు. దీనితో  భారీగా మెహరించి పోలీసులకు,వి ఆర్ ఏ ల మధ్య తోపులాట జరిగింది.అనంతరం పలువురు వి ఆర్ ఏ నాయకులను స్టేషన్ కు తరలించారు.వి ఆర్ ఏ లకు పే స్కేల్ మంజూరు చేయాలి, ఇంకా వారసులకు ఉద్యోగాలు, ఇంకా ప్రమోషన్ జీ ఓ విడుదల చేయాలనీ, ఇంకా వాళ్ళను నైట్ వాచ్మాన్, స్వీపర్, అటెండర్, డ్రైవర్ గా, కంప్యూటర్ ఆపరేటర్ గా వ్యక్తిగత పనులకువాడుకోవద్దని రాష్ట్ర వి ఆర్ ఏ కార్యాచరణ కమిటీపిలుపు మేరకు సమ్మె నోటీసు ఇచ్చారు,కావున పైన తెలిపిన డ్యూటీ లను నుంచి వేంటనే విడుదల చేయాలనీ, ఇంకా 55 ఏళ్ళు పైబడిన వారికీ వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ, పలుమార్లు ప్రభుత్వానికి మరియు రెవిన్యూ అధికారులకుఇచ్చినప్పటకి ప్రభుత్వం మాకు న్యాయం చేయనందున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ ముట్టడి జరిగింది.రాష్ట్ర వి ఆర్ ఏ జాయింట్ యాక్షన్ కమిటీ నల్గొండ చైర్మన్ నార్ల శ్రీనివాస్, మరియు జనరల్ సెక్రటరీ గంతేకంపు శ్రీనివాస్, జిల్లాకు సంబందించిన వి ఆర్ ఏ లు పాల్గున్నారు.