ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు: సిపిఎం

విశాఖపట్టణం,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): జాబ్‌ రావాలంటే బాబు రావాలన్న నినాదమిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ఉద్యోగాల మాట ఎలా ఉన్నా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం అన్నారు. విమర్శించారు. ఉత్తరాంధ్రలో 105 పరిశ్రమలు మూతపడి 38 వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని, దీంతో దీంతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఇటువంటి ఆర్థిక విధానాలకు అడ్డుకట్ట వేయాలంటే ఉమ్మడి పోరాటం చేయాలని లోకనాథం కోరారు. అధిక ధరలను అరికట్టాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ఉపాధి కల్పనా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరించరాదని అన్నారు. /రిళిజుకు 10, 12 గంటలు పని చేసే అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, 5 లేబర్‌ యాక్టులను మార్చుతూ కార్మిక హక్కులను హరించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని విమర్శించారు. మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటి నినాదాల వల్ల ఒక్క పైసా కూడా పెట్టుబడి రాలేదని చెప్పారు. తమ న్యాయమైన కోర్కెల కోసం ఆందోళన చేస్తున్న కార్మిక వర్గానికి సిపిఎం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. కష్టజీవుల కడుపు కొట్టే విధానాలను బిజెపి, టిడిపి ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయన్నారు.

—————–

 

తాజావార్తలు