ఉపఎన్నికల వేళ భాజపాకు భారీ షాక్‌..

` రెండు రోజుల్లో ముగ్గురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిక
` స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ల ఘర్‌ వాపసీ
` పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కెటిఆర్‌
` మరికొందరు నేతలూ బిజెపిని వీడే ప్రయత్నాలు
` గులాబీ గుబాళింపుతో బిజెపి ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్‌,(జనంసాక్షి): మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ సమయం సవిూపిస్తున్న కొద్ది భారతీయజనతాపార్టీకి షాక్‌ల విూద షాక్‌లు తగులుతున్నాయి. భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్‌ను బిజెపిలో చేర్చుకోవడంతో అంతకు మించి అన్నట్లుగా బిజెపికి దిమమతిరిగేలా టిఆర్‌ఎస్‌ షాకిచ్చింది. అంతేగాకుంగా బిజెపి నినాదం ఘర్‌ వాపసీని అమలుకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగా తొలుత రెండు బారీ వికెట్లను బిజెపి నుంచి ఔట్‌ చేసింది. శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామి గౌడ్‌, దాసోజు శ్రవణ్‌  బిజిఎపిని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేలా కెటిఆర్‌ మంత్రాంగం నడిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం తామేనని ధీమాతో ఉన్న కాషాయపార్టీ నేతలకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ షాకులిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే టీఆర్‌ఎస్‌ వ్యూహంలో బీజేపీ చిక్కుకుందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో బీసీ సామాజికవర్గం ఎజెండాతో బీజేపీ ముందుకుపోతోంది. ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని కమలం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వరుసగా బీజేపీకి ఆ పార్టీ నేతలు గుడ్‌బై చెబుతున్నారు. దీంతో తెలంగాణ కాషాయపార్టీలో కలవరం మొదలైంది. గురువారం భిక్షమయ్య గౌడ్‌, నేడు దాసోజు, స్వామిగౌడ్‌ బీజేపీకి రాజీనామా చేశారు. మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బీసీ నేతలు దూరమవుతున్నారు. అలాగే జితేందర్‌ రెడ్డి, విఠల్‌, ఏనుగు రవీందర్‌ రెడ్డిలు బీజేపీని వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆయా నేతలు ఖండిరచారు. మాజీమంత్రి దేవేందర్‌ గౌడ్‌ తనయుడు వీరేందర్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ లకు మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. దిద్దుబాటు చర్యలకు ఆ పార్టీ అధిష్టానం దిగింది. పార్టీని వీడొద్దంటూ నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. ఈ క్రమంలో  టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. స్వామిగౌడ్‌ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడారని, దాసోజు శ్రవణ్‌  పాలిటిక్స్‌లో సెల్ఫ్‌ మేడ్‌ లీడర్‌ అని కేటీఆర్‌ అన్నారు. వీరిద్దరూ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. కాగా గతంలో వీరిద్దరూ టీఆర్‌ఎస్‌ లో కీలకంగా పనిచేశారు. తాజాగా దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతోనే ఆగలేదని, మరికొందరు బిజెపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే బూడిద భిక్షమయ్య గౌడ్‌ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. నోట్లు పంచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానట్లు శ్రవణ్‌ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని స్వామిగౌడ్‌ స్పష్టం చేశారు. బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాతినిధ్యం అధికంగా ఉందని పేర్కొన్నారు. బలహీన వర్గాల ఉన్నతికి బీజేపీ సహకరించడం లేదన్నారు.

తాజావార్తలు