ఉపకార వేతనాల గడువును పొడిగించాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 18: విద్యార్థులు ఉపకార వేతనాల దరఖాస్తు గడువును పొడగించాలని ఎబివిపి డిమాండ్‌ చేసింది. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను అడుగుతున్నందున వాటి జారీలో తీవ్ర జాప్యం జరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని గడువును మరో 20 రోజుల పాటు పెంచాలని సంఘం డిమాండ్‌ చేసింది. గడువు ఈ నెల 20వ తేదీతో ముగుస్తుండడంతో ఎంతో మంది పేద ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు నష్ట పోవడం జరుగుతుందని వెంటనే ప్రభుత్వం పునరాలోచించి గడువును పెంచాలని సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.