ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్‌ నామినేషన్‌

హాజరైన ప్రధాని మోడీ, నడ్డా తదితరులు

న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు పాల్‌ఒన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని
మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. భారత దేశ రెండో అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజస్థాన్‌లోని.. ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. ఆయన కిసాన్‌పుత్ర అనే గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్తోడ్‌గఢ్‌ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందిన ధన్‌ఖడ్‌.. రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు. రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. దేశ ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈ సందర్బంగా ధన్‌ఖడ్‌ తెలిపారు. నాలాంటి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఈ అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా నాయకత్వానికి కృతజ్ఞతలు అని జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు.