ఉపసభాపతి ఆధ్వర్యంలో ఆర్జీల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్జీల కమిటీ నేడు సమావేశమైంది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వేసిన ఆర్జీపై సమావేశంలో చర్చ జరిగింది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.  రన్‌అల్‌ఖైమా, ఆంధ్రా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు  చేయాలని వారు కోరారు. సభ్యుల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌ తెలియజేశారు.