ఉపాధిహావిూని పటిష్టం చేయాలి
విజయవాడ,ఆగస్ట్6(జనం సాక్షి): ఉపాధి హావిూ చట్ట పరిరక్షణకు ఉద్యమించాలని వ్యవసాయకార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హావిూచట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్న ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఉపాధి హావిూ చట్టం ప్రకారం 200 రోజుల పనిదినాలు కల్పించి రోజుకు 300 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హావిూ చట్టం పరిరక్షణకు రూ.65 వేలకోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఆహారభద్రత చట్టాన్ని అమలు చేసి ప్రతి కుటుంబానికీ 35 కిలోల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడం, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ ప్రజలపై ఆర్థికభారాలు మోపుతున్నాయన్నారు.