ఉపాధి నిధులతో అభివృద్ది పరుగులు

అనేక కార్యక్రమాలతో ప్రత్యేక పనులు
అమరావతి,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం, 14వ ఆర్థిక సంఘం, షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ఉప ప్రణాళిక నిధులు గ్రావిూణాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. వీటిని గ్రామాభివృద్ధికి వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ, రూపొందించిన ప్రణాళిక సానుకూల ఫలితాలిస్తోంది. ఈ పథకంఅమలులోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా 80 లక్షలకుపైగా వ్యవసాయ కూలీలు ఉపాధి పొందుతున్నారు. అయితే ఇటీవల విపక్ష వైకాపా ఉపాధి హావిూ పథకం దుర్వినియోగం అవుతోందని, నిధులు దారి మళ్లాయని కేంద్రానికి అదేపనిగా ఫిర్యాదు చేసింది. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. కేంద్రం కూడా ఫిర్యాదుపై ఆరా తీసింది.అయితే   పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.9,600 కోట్లు కేటాయించింది. స్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో గడచిన మూడేళ్లలో ప్రత్యేకించి దళితవాడల్లో, గిరిజన గ్రామాల్లో రహదారులు, కాలువలు అభివృద్ధి చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే చక్కటి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు గ్రావిూణ ముఖచిత్రాన్ని గణనీయంగా మార్చేస్తాయి. ఇకపోతే ఎల్‌ఈడీ వీధి దీపాలను గ్రామాల్లో ఏర్పాటు చేసేలా కార్యాచరణ మొదలైంది. పంచాయతీలు రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పదేళ్ల వరకు నిర్వహణ బాధ్యత తీసుకునేలా రెండు ప్రభుత్వ ఇంధన రంగ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. విద్యుత్తు వినియోగం తగ్గించడంతో వచ్చే మిగులు నిధులను నిర్వహణ కోసం ఖర్చు చేసేలా ఈ కార్యక్రమం రూపొందించారు. మేజర్‌ పంచాయతీలుగా ఉన్న 150 గ్రామాల్లో భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ ను అందుబాటులోకి తేవాలన్నది పారిశుద్ధ్య సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చేపట్టింది. నీటిశుద్ధి చేసే అవసరం లేకుండా ఇళ్లలోంచి వచ్చే నీరు పైపులద్వారా కాలువల్లోకి చేరేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దశల వారీగా ఇతర పంచాయతీల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రావిూణ తాగునీటి సరఫరా సంస్థను ఏర్పాటు చేసింది. పల్లెప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేలా అంచనాలు రూపొందించారు.  తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల ప్రజల కోసం 103 క్లస్టర్లలో ఎన్టీఆర్‌ సుజల కింద కూడా సురక్షిత నీటిని అందించే మరో కార్యక్రమం చేపట్టనున్నారు.
————–
————————

తాజావార్తలు