*ఉపాధ్యాయ సంఘాల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
* పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి.
చిట్యాల16( జనంసాక్షి) ఉపాధ్యాయ సంఘాల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని పిఆర్టియు జిల్లా అధ్యక్షులు రేగురే సుధాకర్ రెడ్డి అన్నారు .శుక్రవారం పిఆర్టియు టీఎస్ సభ్యత్వ నమోదు వారోత్సవాలలో భాగంగా మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల పిఆర్టీయు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రేగురు సుభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు . ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరించబడాలంటే రాష్ట్రంలోని నెలకొన్న ఉపాధ్యాయు సంఘాలకు తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని,గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితే, ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన సంఘాలతో చర్చలు జరిపి, అన్ని రకాల సమస్యలకు పరిష్కారం సులభంగా లభిస్తాయని ప్రభుత్వం తో పోరాడి సమస్యలను సాధించే సంఘాలు మాత్రమే మన గలుగుతాయని ఉద్గాటించారు.
పిఆర్టియు సంఘం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో, అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి, అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కంకణబద్ధులై పని చేస్తున్నదన్నారు. 19 జిల్లాల్లో ఉన్నటువంటి స్పౌస్ లను ఒకే జిల్లాలకు అలాట్ చేయించడానికి మ్యూచువల్ ద్వారా కోరుకున్న జిల్లాకు వెళ్లే ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించిన ఘనత మన పిఆర్టియు గొప్ప చరిత్ర ఉన్న మన సంఘంలో వందకు వందశాతం ఉపాధ్యాయులు సభ్యత్వం స్వీకరించాలని పిలుపునిచ్చారు.రాబోయే రోజుల్లో 317 ద్వారా 13 జిల్లాల స్పౌజులలో కూడా వారి వారి జిల్లాలకు అలాంటి చేయించడానికి కూడా రాష్ట్ర సంఘం కృషి చేస్తున్నదని తెలిపారు.రాబోయే నెల రోజుల్లో అన్ని రకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించిన తర్వాత పదోన్నతులు బదిలీలను నిర్వహించాలని రాష్ట్ర సంఘానికి ప్రాతినిధ్యం చేయబోతున్నామని తెలిపారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు తక్షణమే కోర్టు సమస్యలు పరిష్కరించి వారిని కూడా త్రీ వన్ సెవెన్ ద్వారా ఉద్యోగుల జోనల్ మల్టీ జోన్ అకేషన్ ప్రక్రియ చేపట్టాలని అనంతరం వారికి కూడా బదిలీలు చేపట్టాలని కోరారు. మోడల్ స్కూలు ఉపాధ్యాయులకు తక్షణమే హెల్త్ కార్డులను, మెడికల్ రీయంబర్స్మెంట్ మంజూరు చేయాలని జిల్లా సంఘ అధ్యక్షులు రేగురి సుభాకర్ రెడ్డి గారు డిమాండ్ చేశారు…
కేజీబీవీ లలో పనిచేస్తున్న సి ఆర్ టి లకు & పీజీసీఆర్టీలకు మినిమం టైం స్కేల్ వర్తించాలని వారికి కూడా హెల్త్ కార్డులను మెడికల్ రియంబర్స్మెంట్ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పిఆర్టియు సంఘం ఆవిర్భవించి స్వర్ణోత్సవాల సంబరాలు జరుపుకుంటున్న వేళ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అనువైన పరిష్కారం మార్గాన్ని చూపిస్తున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం పిఆర్టియు సంఘం అని పిఆర్టియు సంఘం మీద , సంఘ నాయకత్వం మీద అతీతమైన నమ్మకాన్ని ఉండి మీ అమూల్యమైన సభ్యత్వాన్ని అందించి, సమస్యల పరిష్కారానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మండల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు వారోత్సవంలో మండల శాఖ అధ్యక్షులు పంచిక భగవాన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్ ,మండల జిల్లా ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెలదండి హనుమంతు ,తడక ప్రవీణ్ ,మారం తిరుపతిరెడ్డి, ఎన్ మనోహర్రావు ,సుధాకర్ రెడ్డి ,శైలజ ,లింగయ్య, గోవిందు సత్యనారాయణ సతీష్ తదితరులు పాల్గొన్నారు.