ఉప్పుసాక గ్రామంలో రైతులకు వయోగో మీద అవగాహన సదస్సు.

 

బూర్గంపహాడ్, ఆగష్టు 20(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామపంచాయతీలో
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పురుగుల మందుల కంపెనీ బయర్, క్రఫ్ సైన్స్ వారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, బాయర్ గ్రామ్ ప్రగతి యొక్క ప్రతిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉప్పుసాక గ్రామన్నీ ఆదర్శ గ్రామం గా ఎంచుకొని గ్రామంలోని రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని రైతులందరికీ సాంకేతిక వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను వివరించారు. కంపెనీవారు నూతనంగా విడుదల చేసిన, వయాగో మందు పై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు దత్తతలో భాగంగా మొక్కలు నాటడం, ముగ్గుల పోటీ నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామపంచాయతీ సర్పంచ్, పాయం వెంకటేశ్వర్లు, బాయర్ కంపెనీ ప్రతినిధి బి.నరేంద్ర కుమార్, టిబిఎం ఫీల్డ్ ఆఫీసర్ భూక్య ఆనందరావు, గ్రామ పెద్దల చేతుల మీదగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.