ఉప్పొంగిన జాతీయ భావం

*:మండల కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన

టేకులపల్లి, ఆగష్టు 16(జనంసాక్షి) : భారత స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు నిండిన సందర్భంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న వజ్రోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక్క నిమిషం సామూహికంగా జాతీయ గీతాలాపన చేసి దేశ భక్తిని మరింత చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల యంత్రాంగం సర్వం సన్నద్దమై తగు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చి సామూహిక జాతీయ గీతాలాపనతో మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, స్తానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సామూహిక జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి భూక్యరాధ, ఎంపీటీసీలు సర్పంచులు తహసిల్దార్ కెవి శ్రీనివాసరావు ఎంపీడీవో బాలరాజు టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు ఎస్సై భుక్యా శ్రీనివాస్ ఎంపీ ఓ ఏపీఓ పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ ట్రాన్స్కో ఎఇ సతీష్ మండల కేంద్రంలోని ఆయా పాఠశాలల విద్యార్థులు  కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.