ఉలవల పంపిణీ
విజయవాడ,సెప్టెంబర్17(జనంసాక్షి): రొంపిచెర్ల మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వం ఉచితంగా అందించిన ఉలవలను టిటిడి పాలకమండలి సభ్యులు చల్లా రామచంద్రా రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. అనంతరం చల్లా మాట్లాడుతూ.. ఎన్నో అవరోధాలు రాష్ట్రంలో ఎదురైనప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమాన్ని మరువలేదన్నారు. ప్రతినిత్యం రైతులకు ఉపయోగపడేలా సబ్సిడీతో పరికరాలు, ఎరువులు, విత్తనాలు, యంత్రాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయకుమారి, ఎంపిడిఒ ఉమాలక్ష్మి, ఎఒ సూర్యప్రకాష్ రెడ్డి, ఆర్ ఐ వాణి, ఎంపిఇఒ లో ప్రవీణ్ బాబు, వనిత, హేమలత, టిడిపి నాయకులు ఉయ్యాల రమణ, ఓబులేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.