ఊపిరితిత్తుల వ్యాధులతో 13,500మందికి పైగా మృతి

మహా అసెంబ్లీలో మంత్రి వెల్లడి

నాగ్‌పూర్‌,జూలై17(జ‌నం సాక్షి): వివిధ రకాలైన ఆరోగ్య సంబంధత కారణాలతో మహారాష్ట్రంలో గతేడాది ఏప్రిల్‌ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13,500మందికి పైగా మరణించారని ఆరోగ్య శాఖ మంత్రి దీపక్‌ సావంత్‌ తెలిపారు. బరువు తక్కువగా వుండడం, న్యుమోనియా, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఇందులో ప్రధానంగా వున్నాయి. మొత్తంగా 13.541మంది మరణించగా అందులో 22శాతం మంది కేవలం బరువు తక్కువగా వుండడం వల్లే చనిపోయారని మంత్రి రాతపూర్వక సమాధానంలో అసెంబ్లీకి తెలియచేశారు. న్యుమోనియా, ఇన్‌ఫెక్షన్లతో ఏడుశాతం మంది ప్రాణాలు కోల్పోయారు. 14శాతం మంది పిల్లలు ఊపిరితిత్తుల సమస్యలతో కనుమూశారని ఆయన తెలిపారు. పుట్టిన 28 రోజుల్లోనే 65శాతం మంది పిల్లలు చనిపోగా, 28 రోజుల నుండి ఏడాది వయస్సులోపు వారు 21శాతం మంది చనిపోయారని సావంత్‌ చెప్పారు.