ఎంఐఎం మద్దతు లేకున్న ఇబ్బంది లేదు: ఆరేపల్లి మోహన్‌

హుస్నాబాద్‌: రాష్ట్ర చరిత్రలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు నైతికంగా తప్పా నేరుగా ఏనాడు ఓటువేసి మద్దతు తెలపలేదని ప్రభుత్వ విప్‌ ఆరేపల్లి మోహన్‌ అన్నారు, కాంగ్రెస్‌కు మజ్లీన్‌ మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో అన్నారు. అవసరమైన సంఖ్యాబలం కాంగ్రెస్‌కుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి లేదని, సంక్షేమ పధకాలు యధావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.