ఎంపి హెటిరో పార్థసారధిరెడ్డిఫై ఇసిలో ఫిర్యాదు
తప్పుడు అఫిడవిట్‌పై చర్య తీసుకోవాలన్న ప్రజలు
న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదైన క్రిమినల్ కేసులు, ఐటీదాడులను పేర్కొనలేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ పార్థసారధి రెడ్డిపై వేటు వేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. హెజోల కంపెనీవల్ల, యాదాద్రి జిల్లాలోని అంతమ్మ గూడెంలో పార్థసారధి రెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ వల్ల 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాయు, కాలుష్యం, భూ కాలుష్యం వల్ల ప్రజలు జీవించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాధితులు పేర్కొన్నారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశామని, విచారణ కొనసాగుతోందన్నారు. పార్థసారధి రెడ్డి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. కిందస్థాయి నేతలను సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ను కలిసే పరిస్థితి లేదని పరిశ్రమల బాధిత సంఘం నేత నరేందర్ రెడ్డి అన్నారు