ఎంపీ కవిత అమెరికా పర్యటన

oq0uhb1aఎంపీ కవిత ఇవాళ రాత్రి అమెరికాకు వెళ్లనున్నారు. న్యూజెర్సీలోని ప్రతిష్ఠాత్మక ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో నిర్వహించే.. అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాలపై సదస్సులో ఆమె పాల్గొంటారు. ఏప్రిల్ 5వ తేదీనుంచి 9 తేదీవరకు.. ఉడ్రో విల్సన్ అంతర్జాతీయ సంబంధాల కేంద్రంలో ఈ సెమినార్ జరుగనుంది. అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాల్లో ప్రస్తుత అవసరాలు, మార్పులకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.